ఒడిషాలో మావోల ఘాతుకం: పోలింగ్ సిబ్బందిపై పేలిన తూటా

ఒడిషాలో మావోల ఘాతుకం: పోలింగ్ సిబ్బందిపై పేలిన తూటా

పోలింగ్ ప్రారంభం కాకముందే రెండో విడత ఎన్నికల్లో హింస చోటు చేసుకుంది. పోలింగ్ స్టేషన్ కు బయలుదేరిన మహిళా అధికారిని మావోయిస్టులు కాల్చిచంపారు. ఒడిషాలోని కంధమాల్ జిల్లా అడవుల్లో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఇదే ఏరియాలోని మరో గ్రామంలో ఎన్నికల సిబ్బందిని అటకాయించిన నక్సల్స్ , జీపుతోపాటు ఈవీఎంలు, ఇతరత్రా సామగ్రిని తగులబెట్టారు. ఈ రెండు చోట్లా పోలింగ్ రద్దుపై ఈసీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

సినీఫక్కీలో అడ్డగింత….

ఫుల్బనీలో స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న సంజుక్తా దిగల్ కు కంధమాల్ లోక్ సభ పరిధిలోని ఫుల్బనీ అసెంబ్లీ సెగ్మెట్ లో ఎన్నికల సెక్టార్ ఆఫీసర్ గా డ్యూటీ పడింది. బుధవారం మధ్యాహ్నం కంధమాల్ జిల్లా కేంద్రంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో పోలింగ్ సామగ్రిని కలెక్ట్​ చేసుకున్న ఆమె, తనకు కేటాయించిన సిబ్బందితో కలిసి జీపులో గమ్యస్థానానికి బయలు దేరా రు. దారి మధ్యలో బలందపార గ్రామానికి సమీపంగా రోడ్డుపై గుర్తుతెలియని వస్తువు కనిపించడంతో డ్రైవర్ జీపును ఆపాడు. అందరినీ లోపలే కూర్చోమని ఆదేశించిన సంజుక్తా, రోడ్డుపైనున్న వస్తువును పక్కకు జరపాలన్న ఉద్దేశంతో జీపు దిగి నాలుగు అడుగులు వేసిం ది. అప్పటి కే చెట్ల పొదల్లో మాటువేసిన మావోయిస్టులు, ఆమెపై కాల్పులు జరిపారు.షాక్ కు గురైన సిబ్బం ది ప్రాణభయంతో జీపులోనే నక్కికూర్చున్నా రు. యూనిఫామ్ లో వచ్చిన మావోయిస్టులు ఐదారు రౌండ్లు ఫైరిం గ్ చేసిన తర్వాత వెళ్లిపోయారని, ఇతర సిబ్బం ది క్షేమంగా ఉన్నారని, భద్రతా సిబ్బం ది ఘటనా స్థలానికి చేరుకుని మావోయిస్టుల కోసం గాలిస్తున్నారని ఒడిశా డీజీపీ బీకే శర్మ తెలిపారు. కంధమాల్ జిల్లాలోని మరో కుగ్రామంలో మావోయిస్టులు, ఎన్నికల సిబ్బందిని దింపేసి ఈవీఎంలతో పాటు వాహనాన్ని తగుల బెట్టారని చెప్పారు.

భద్రతా ఏర్పాట్లపై సిబ్బంది ఆగ్రహం…

మావోయిస్టుల ప్రాబల్యమున్న కంధమాల్ జిల్లాలో అరకొర భద్రత కల్పిం చడంపై ఎన్నికల సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందే ఎన్నికల బహిష్కరణకు పిలుపిచ్చిన మావోయిస్టులు, ఆమేరకు చాలా చోట్ల పోస్టర్లు , బ్యానర్లు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పనిచేసే ఎన్నికల సిబ్బందికి రక్షణ కల్పించాల్సిన ఎన్నికల సంఘం, సంజుక్తా బృందం వెంట కనీసం ఎస్కార్టును పంపకపోవడం చర్చనీయాం శమైంది.