మరాఠి తప్పనిసరిగా మాట్లాడాల్సిందే : మంత్రి యోగేశ్

మరాఠి తప్పనిసరిగా మాట్లాడాల్సిందే : మంత్రి  యోగేశ్
  •  మహారాష్ట్ర మంత్రి  యోగేశ్  వార్నింగ్

ముంబై: మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడడం తప్పనిసరి అని ఆ రాష్ట్ర మంత్రి యోగేశ్  కదమ్  అన్నారు. లేకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. మహారాష్ట్రలో మరాఠీ తప్పనిసరిగా మాట్లాడాలని, ఎవరికైనా మరాఠీ తెలియకపోతే, మరాఠీ మాట్లాడం అన్నట్లుగా ప్రవర్తించకూడదని పేర్కొన్నారు. అలాగే ఈనెల 1న ముంబై శివారు ప్రాంతంలోని భయీందర్  ఏరియాలో ఓ షాప్ కీపర్ పై జరిగిన దాడిపైనా మంత్రి స్పందించారు. 

షాప్ కీపర్ ను కొట్టడం సరికాదని, చట్టాన్ని ఎవరూ కూడా తమ చేతుల్లోకి తీసుకోరాదన్నారు. కొట్టడం బదులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాల్సిందన్నారు. కాగా.. మంగళవారం భయీందర్  ప్రాంతంలో ఓ ఫుడ్ షాప్ కు కొంతమంది వెళ్లారు. ఆహారం కొంటుండగా వారిలో ఓ వ్యక్తి.. మరాఠీలో మాట్లాడాలని షాప్ కీపర్ కు చెప్పాడు. అందుకు అతను ఒప్పుకోలేదు. దీంతో ఆ వ్యక్తి షాప్ కీపర్ ను తిట్టాడు. అతని వెంట వెళ్లిన మరికొందరు కలిసి షాప్ కీపర్ ను చెంపదెబ్బ కొట్టారు. నిందితులందరూ  ఎంఎన్ఎస్ కండువాలు ధరించి ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.