మైలారుగూడెం సర్పంచ్ గా ‘మారెడ్డి కొండల్ రెడ్డి’

మైలారుగూడెం సర్పంచ్ గా ‘మారెడ్డి కొండల్ రెడ్డి’
  •     ఏకగ్రీవమైన సర్పంచ్, ఏడుగురు వార్డు సభ్యులకు నియామక పత్రాలు అందజేసిన ఆర్వో వెంకటేశ్వర్లు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట మండలం మైలారుగూడెం గ్రామ సర్పంచ్ గా మారెడ్డి కొండల్ రెడ్డి ఎన్నికయ్యారు. సర్పంచ్ గా కొండల్ రెడ్డి ఏకగ్రీవం కావడంతో.. రిటర్నింగ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఆయనకు సర్పంచ్ నియామక పత్రాన్ని అందజేశారు. 

ఈ మేరకు సర్పంచ్ మారెడ్డి కొండల్ రెడ్డి మాట్లాడుతూ.. మైలారుగూడెం సర్పంచ్ గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల వమ్ము చేయబోనని, ఇచ్చిన హామీ మేరకు గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. కాగా మైలారుగూడెం సర్పంచ్ స్థానంతో పాటు ఎనిమిది వార్డులు ఉండగా.. సర్పంచ్ స్థానంతో పాటు ఏడు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 

సర్పంచ్ స్థానానికి మారెడ్డి కొండల్ రెడ్డి, కాదూరి కృష్ణ నామినేషన్లు దాఖలు చేయగా.. కాదూరి కృష్ణ తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నాడు. దీంతో సర్పంచ్ గా మారెడ్డి కొండల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. అదేవిధంగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఏడుగురు వార్డు సభ్యులకు కూడా పత్రాలు అందజేసినట్లు ఆర్వో వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తుడు బండి అశోక్, విలేజ్ సెక్రటరీ అశోక్ గౌడ్ ఉన్నారు.