మారుతి ఈకో వాహనంలో గంజాయి స్మగ్లింగ్

 మారుతి ఈకో వాహనంలో గంజాయి స్మగ్లింగ్

హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మారుతి ఈకో వాహనంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటే తనిఖీ చేసి పట్టుకున్నారు. వీరికి సహకరిస్తున్న మరో నలుగురు సప్లైయర్స్ పరారీలో ఉన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు భువనగిరి ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు. అబ్దుల్లా పూర్ మెట్ పరిధిలో తనిఖీలు చేస్తుండగా మారుతి ఈకో వాహనంలో  గంజాయి ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠా సభ్యులు ఇద్దరు దొరికారు. భువనగిరి SOT  పోలీసులతోపాటు  మల్కాజిగిరి క్రైం , అబ్దుల్లా పూర్ మెట్ పోలీసులు విస్తృతంగా తనిఖీల్లో పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కు చెందిన సైదులు, సైదిరెడ్డి గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 21 లక్షల రూపాయల విలువ చేసే 200 కేజీల గంజాయిని , 03 సెల్ ఫోన్స్ , ఒక మారుతి ఈకో వాహనాన్ని  స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన నిందితులపై కేసు నమోదు చేసుకుని రిమాండ్ కు తరలించారు. కాగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న మెండే వెంకన్న ,  తేలు వెంకన్న ,గోపాల నాగేంద్రం , దళపతి సోమర పరారీలో ఉండగా.. వారి కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని వార్తల కోసం..

17 లక్షలు పెట్టి ఫ్యాన్సీ నెంబరు దక్కించుకున్న జూ.ఎన్టీఆర్

మాంస ఉత్పత్తులకు తెలంగాణ బ్రాండింగ్

సూసైడ్‌ నోట్‌: ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తాడనే ఆత్మహత్య