మార్కండేయ లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 6 నెలల్లో పూర్తి చేస్త : ఎమ్మెల్యే మర్రి జనార్థన్

మార్కండేయ లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 6 నెలల్లో పూర్తి చేస్త : ఎమ్మెల్యే మర్రి జనార్థన్
  • లేదంటే నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గంలో తిరగను
  • పూర్తి చేస్తే నాగం పోటీ నుంచి తప్పకొని తనకు ప్రచారం చెయ్యాలె
  • మాజీ మంత్రి నాగంకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి సవాల్ 
  • 101 బిందెల కృష్ణాజలాలతో శిలాఫలాకం శుద్ధి
  • మాట నిలబెట్టుకోకుంటే ప్రజలే తిరగనివ్వరన్న నాగం

కందనూలు,  నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కర్నూల్ టౌన్, వెలుగు: ఆరు నెలల్లో మార్కండేయ లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేస్తానని, లేదంటే నియోజకవర్గంలో తిరగనని నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి స్పష్టం చేశారు. మాట నిలబెట్టుకునే పోటీ నుంచి తప్పుకొని తనకు ప్రచారం చెయ్యాలని మాజీ మంత్రి నాగం జనార్దరెడ్డికి సవాల్ విసిరారు.  ఆదివారం బిజినేపల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మ గౌర సభకు కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సోమవారం మార్కండేయ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శిలాఫలకం వరకు బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు బిజినేపల్లిలో చౌరస్తాలో డాక్టర్ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లారు.  నాగం అడుగుపెట్టడంతో శిలాఫలకం అపవిత్రమైందని 101 బిందెలతో శాయినిపల్లి శివారులోని కాలువల్లో పారుతున్న కృష్ణా జలాలను తెప్పించి శుద్ధి చేశారు. అనంతరం మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ నాగం జనార్దన్ రెడ్డి తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  ప్రాజెక్టు పనులు ఆరు నెలలు పూర్తి చేయాలని డిమాండ్ చేసిన నాగం సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తాను స్వీకరిస్తున్నానని చెప్పారు. ఆరు నెలల్లో లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి చేసి తీరుతానని, లేదంటే నియోజకవర్గంలో తిరగనని స్పష్టం చేశారు.   

నన్ను తిట్టేందుకే సభ

నాగం జనార్దన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి తనను తిట్టించడమే లక్ష్యంగా దళితులు, గిరిజనుల పేరుతో సభ పెట్టారని ఆరోపించారు.  దళిత, గిరిజనుల ఆత్మగౌరవ సభ అంటే వారికి భరోసా ఇస్తారని అనుకున్నామని, కానీ ఎమీ చెప్పకుండా అవమాన పరిచారని విమర్శించారు.   టీపీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేవంత్ రెడ్డి పొద్దున వచ్చి ఉంటే కాలువల్లో పారుతున్న నీటిని చూపించి ప్రజలే బుద్ధి చెప్పేవారని, అందుకే రాత్రి అయిన తర్వాత సభకు వచ్చారని ఎద్దేవా చేశారు.  తాను ప్రజాధనం లూటీ చేయడం లేదని నిజాయితీగా ప్రజాసేవకు చేస్తున్నానని చెప్పారు.  సొంత డబ్బుతో వేల మంది పేదల పెళ్లిళ్లు చేస్తున్నానని, తిమ్మాజీపేట, తాడూరు స్కూళ్లను కూడా సొంత డబ్బుతో నిర్మిస్తున్నానని చెప్పారు.   చేతనైనే ప్రజాసేవ చెయ్యాలె తప్ప.. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.  అనంతరం మహాదేవుని పేటలో సిలిండర్ పేలి గుడిసె కాలిపోయిన జుర్రు శ్రీశైలం కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కురుమయ్య, బాలరాజ్ గౌడ్, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, వైస్ ఎంపీపీ చిన్నారెడ్డి, శేఖర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రాజేందర్ రెడ్డి, బాబురావు పాల్గొన్నారు. 

కృష్ణా జలాలు నేను తెచ్చినవే 

ఎమ్మెల్యే మర్రి మార్కండేయ లిఫ్ట్ శిలాఫలకాన్ని శుద్ధి చేసిన కృష్ణా జలాలు తాను కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ ద్వారా తెచ్చినవేనని మాజీ మంత్రి నాగం జనార్దన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి స్పష్టంచేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టి మాట్లాడారు. ‘మర్రి.. స్థాయి తెలుసుకొని మాట్లాడు.. నన్ను విమర్శించే మొగుడివా?’ అని ఫైర్ అయ్యారు. ఆరు నెలల్లో మార్కండేయ లిఫ్టు పూర్తి చేయకపోతే నియోజకవర్గంలో ప్రజలే అడుగు పెట్టనివ్వరని హెచ్చరించారు.  దళిత, గిరిజన నేతలపై దాడులు చేయించడమే కాదు.. ఆత్మ గౌరవ సభను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశాడని ఆరోపించారు. ఎమ్మెల్యే రాజకీయ నాయకుడా?  రౌడీనా..? అని ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు చేసి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సభను సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారని స్పష్టం చేశారు. వట్టెం రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్ట     పనులు నాసిరకంగా ఉన్నాయని,  వెంటనే అలర్ట్ కాకపోతే భద్రత లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.  8 ఏండ్ల నుంచి కేఎల్ఐలో మినీ కాలువలు నిర్మించడం లేదని మండిపడ్డారు.    ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు రోహిణి, డీసీసీ ప్రధాన కార్యదర్శి అర్థం రవి, నారాయణ గౌడ్, లక్ష్మయ్య, బాల గౌడ్, కౌన్సిలర్స్ నిజామోద్దీన్, సుల్తాన్, సునేంద్ర పాల్గొన్నారు.