
జమ్మూకాశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో అధికారులు ఆంక్షలు ఎత్తేశారు.105 పోలీస్ స్టేష న్లకు గాను 82 స్టేషన్ల పరిధిలో బారికేడ్లను తొలగించామని సెక్యూరిటీ అధికారులు చెప్పారు. సెక్యూరిటీ మాత్రం కొనసాగిస్తున్నామన్నారు. ఇప్పటికే 47 టెలిఫోన్ ఎక్సెంజ్ లు పని చేస్తుండగా అదనంగా 29 ఎక్సేంజ్ లను ఏర్పాటు చేశారు. కాశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో మార్కెట్లు తెరుచుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకులు దొరకకపోవడంతో కష్టపడుతున్నారు. గవర్నమెంట్ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రజలు ప్రైవేటు వాహనాలు , క్యాబ్ లను ఆశ్రయిస్తున్నారు. మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులపై వరుసగా 28వ రోజు బ్యాన్ కొనసాగుతోంది.