
నారాయణఖేడ్, వెలుగు : ఓటు వేయడానికి బద్ధకించే ఎంతోమందికి ఓ నవవధువు ఆదర్శంగా నిలిచింది. పెళ్లి చేసుకున్న వెంటనే భర్తను ఒప్పించి పెళ్లి బట్టలతోనే ఓటు వేసింది. కామారెడ్డి జిల్లా పిట్లం శాంతాపూర్ కు చెందిన లక్ష్మణ్ కు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం ర్యాకల్ కు చెందిన విజయలక్ష్మితో గురువారం 11 గంటలకు వరుడి ఇంటి దగ్గర పెళ్లి జరిగింది. పెళ్లవగానే భర్తను ఒప్పించి 35 కి.మీ. దూరంలోని ర్యాకల్ కు చేరుకొని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసింది.