పిల్ల ఇక్కడ.. పిలగాడక్కడ

పిల్ల ఇక్కడ.. పిలగాడక్కడ

కరోనా ఎఫెక్ట్ తో ఆగిన లగ్గాలు
మేలోనైనా సాధారణ పరిస్థితులు వచ్చేనా?
ఫారిన్లో ఉన్న పిల్లపై పేరెంట్స్ బెంగ

హైదరాబాద్, వెలుగు: ఖమ్మం జిల్లాకు చెందిన రవళికి, భద్రాచలానికి చెందిన మనోహర్ తో పెండ్లి కుదిరింది. ఈ నెల 18న లగ్గానికి ఫిబ్రవరిలోనే ముహూర్తం ఖరారు చేశారు. ఉద్యోగ రీత్యా మనోహర్ అమెరికాలో ఉంటున్నాడు. ఈ నెల ఒకటి రావాల్సి ఉండగా, కరోనా ఎఫెక్ట్ తో మనోహర్ అక్కడే చిక్కుకుపోయాడు. ఇట్ల కరోనాఎఫెక్ట్ తో చాలా వేడుకలు వాయిదా పడ్డాయి. కరోనా ఎప్పుడు కట్టడిలోకి వస్తుందో, పరిస్థితి ఎప్పటికి సాధారణ స్థితికి చేరుకుంటుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇండియాకు వద్దామని ప్లాన్ చేసుకున్న వాళ్లు
కొందరు ఉండగా, వేసవిలో ఫంక్షన్లు, పెండ్లిళ్ల కోసం పలువురు అబ్బాయిలు, అమ్మాయిలు ఇండియాకు రావాల్సి ఉంది. వాళ్లందరూ తమ ట్రిప్పులు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

ఫంక్షన్ హాళ్లకు అడ్వాన్స్
విదేశాల్లోని పిల్లల పెండ్లి కోసం చాలామంది తల్లిదండ్రులు ఫిబ్రవరి, మార్చిలోనే ఫంక్షన్ హాళ్లను బుక్ చేసి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కొందరు కార్డులు కూడా పంచారు. పెండ్లే తరువాయి అనుకున్నా, కరోనాతో అంతా తారుమారైంది. లాక్డౌన్ను పొడిగించే అవకాశాలు కనిపిస్తుండటంతో పెండ్లిళ్లకు మరింత టైం తీసుకోవాల్సి వస్తుందని భావిస్తున్నారు. వచ్చే నెల నుంచి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చినా.. మంచి ముహుర్తాలు లేకపోతే ఎట్లని ఆందోళన చెందుతున్నారు. జూన్లో ముహూర్తాలు ఉన్నా వర్షాలతో ఇబ్బందని ఆలోచిస్తున్నారు.

వేల మంది ఉపాధికి దెబ్బ
మన దగ్గర ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో పెండ్లిళ్లు బాగా జరుగుతుంటాయి. వాటి అనుబంధ వ్యాపారాలు రూ.వేల కోట్లలో సాగుతాయి. ఫంక్షన్
హాళ్లు, డెకరేషన్, క్యాటరింగ్, వెహికల్స్, బ్యాండ్ మేళం, పూలు ఇలా వేల మంది ఉపాధి పొందుతుంటారు. ఆ వ్యవస్థంతా ఇప్పుడు దెబ్బతింది.

డైలీ వీడియో కాల్స్
ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విదేశాల్లో ఉన్న తమ పిల్లలకు డైలీ వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నారు.

For More News..

సారీ.. ఇండియా మూడో స్టేజ్‌లో లేదు

నో కాంటాక్ట్, నో ట్రావెల్ హిస్టరీ.. అయినా కరోనా ఎటాక్

100 రోజులు.. లక్ష మరణాలు

లాక్ డౌన్ ఎఫెక్ట్.. క్వార్టర్ మందు రూ. 1,000