Cricket World Cup 2023: మిచెల్ మార్ష్ భారీ శతకం.. చివరి మ్యాచ్ లో బంగ్లాను చిత్తు చేసిన ఆసీస్

Cricket World Cup 2023: మిచెల్ మార్ష్ భారీ శతకం.. చివరి మ్యాచ్ లో బంగ్లాను చిత్తు చేసిన ఆసీస్

వరల్డ్ కప్ లో ఆసీస్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ పై తృటిలో ఓటమి తప్పుంచుకున్న కంగారూల జట్టు బంగ్లాపై పూర్తి ఆధిపత్యం చెలాయించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో కమ్మిన్స్ సేనకు ఇది వరుసగా ఏడో విజయం కావడం గమనార్హం. ఈ విజయంతో ఆసీస్ దక్షిణాఫ్రికాతో సమానంగా 14 పాయింట్ల సాధించింది. నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడం వల్ల పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు బంగ్లాదేశ్ ఈ పరాజయంతో ఛాంపియన్స్ ట్రోఫీ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
 
307 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కు ప్రారంభంలోనే ఓపెనర్ హెడ్ వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత వార్నర్ కు జత కలిసిన మిచెల్ మార్ష్ బౌండరీల వర్షం కురిపించారు. రెండో వికెట్ కు వీరిద్దరూ 120 పరుగులు జోడించిన తర్వాత వార్నర్ 53 పరుగులు చేసి ముస్తాఫిజర్ బౌలింగ్ లోన్ ఔటయ్యాడు. ఆ తర్వాత స్మిత్ తో కలిసి మరో వికెట్ పడకుండా 44.4 ఓవర్లలో మార్ష్, స్మిత్  ఆసీస్ కు విజయాన్ని అందించాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు అజేయంగా 175 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. మార్ష్ 132 బంతుల్లో 17 ఫోర్లు 9 సిక్సులతో 177 పరుగులు, స్మిత్ 64 బంతుల్లో 4 ఫోర్లు ఒక సిక్సర్ తో 63 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ ముస్తాఫిజార్ చెరో వికెట్ తీసుకున్నారు.      
            
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హృదయ్ 79 బంతుల్లో 74 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్లు టాంజిద్ హసన్ 36, లిటన్ దాస్ 36 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇస్తే.. కెప్టెన్ శాంటో 45 పరుగులు చేసి రాణించాడు. సీనియర్ బ్యాటర్లు మహమ్మదుల్లా 32, ముషఫికర్ రహీం 23 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో జంపా, అబాట్ రెండు వికెట్లు తీసుకోగా.. స్టోయినీస్ కు ఒక వికెట్ దక్కింది.