భలే గమ్మత్తుగా.. మారుతి నగర్ సుబ్రమణ్యం ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

భలే గమ్మత్తుగా.. మారుతి నగర్ సుబ్రమణ్యం  ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వైవిధ్యమైన పాత్రలు, విలక్షణ నటనతో మెప్పిస్తున్న రావు రమేష్..  ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ అనే చిత్రంతో ఆయన హీరోగా పరిచయం అవుతున్నారు.  లక్ష్మణ్ కార్య దీనికి దర్శకుడు. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. మంగళవారం ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. గళ్ల చొక్కా, ఎర్రలుంగీతో మాస్‌‌‌‌‌‌‌‌ గెటప్‌‌‌‌‌‌‌‌లో తనదైన మేనరిజంతో రమేష్ కనిపించారు.

మారుతీరావు పాత్రలో ఫుల్‌‌‌‌‌‌‌‌గా ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేయబోతున్నట్టు అర్థమవుతోంది. ఈ సందర్భంగా ఆయన సినిమా భలే గమ్మత్తుగా ఉంటుందని చెప్పారు. కుటుంబం అంతా కలిసి చూసేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుందని మేకర్స్ చెప్పారు. రావు రమేష్ సరసన ఇంద్రజ నటిస్తుండగా.. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.