పల్లెటూళ్లలో మారుతి కార్లే ఎక్కువ

పల్లెటూళ్లలో మారుతి కార్లే ఎక్కువ

మిగతా కంపెనీలకు భిన్నంగా.. పల్లె రూట్​తో అమ్మకాల జోరు పెంచిన మారుతి

2008 నుంచి రూరల్ డ్రైవ్

అవుట్ లెట్లను పెంచేసింది

లోకల్ వ్యక్తులతో మంచి సంబంధాలు

బిజినెస్‌‌‌‌ డెస్క్, వెలుగు: 2008 గ్లోబల్ ఆర్థిక సంక్షోభం.. ఇండస్ట్రీ వర్గాలందరికీ ఇది గుర్తుండే ఉంటుంది. ఈ సంక్షోభం ఎదురైనప్పుడు కంపెనీలన్నీ సేల్స్ పెంచుకోలేక సతమతమైతే.. ఒక్క కంపెనీ మాత్రం ఎలాంటి చడీ చప్పుడు లేకుండా మార్కెట్‌‌‌‌లో సరికొత్త స్కీమ్‌‌‌‌లతో ముందుకెళ్లింది. అదే దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకి. ‘ఘర్ ఘర్ మే మారుతీ(ప్రతి ఇంట్లో మారుతీ)’ అనే పేరుతో 2008లో రూరల్ సేల్స్ స్కీమ్‌‌‌‌ను లాంచ్ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సేల్స్‌‌‌‌ను పెంచుకునేందుకు ఈ స్కీమ్‌‌‌‌ను తెచ్చింది. దీంతో అంతకుముందు వరకు మొత్తం సేల్స్‌‌‌‌లో 3.5 శాతంగా ఉన్న రూరల్ సేల్స్.. 2008–09 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతానికి పెరిగింది. ఇక అప్పటి నుంచి ఈ పదేళ్లలో మారుతీ సుజుకి రూరల్ మార్కెట్‌‌‌‌పై బాగా ఫోకస్ పెట్టింది. సేల్స్ అవుట్‌‌‌‌లెట్లను పెంచింది. ఎమర్జింగ్ సిటీల్లో, రూరల్ ఏరియాల్లో మారుతీ సుజుకి సేల్స్ అవుట్‌‌‌‌లెట్లను ఐదింతలు పెంచింది. ప్రస్తుతం ఎమర్జింగ్ మార్కెట్లలో 800 అవుట్‌‌‌‌లెట్లు ఉంటే.. రూరల్ ప్రాంతాల్లో 900 వరకు అవుట్‌‌‌‌లెట్లున్నాయి.

మెయిన్ సిటీల్లో సుమారు వెయ్యికి పైన ఉన్నాయి. ఇండియాలో గ్రామీణ ప్రాంతాలు మారుతీకి అత్యంత ముఖ్యమైన గ్రోత్ డ్రైవర్‌‌‌‌‌‌‌‌గా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల సేల్స్ వాల్యుమ్ పరంగా మూడింతలు పెరిగాయి. 2010 ఆర్థిక సంవత్సరం నుంచి 2020 ఆర్థిక సంవత్సరం మధ్యలో మారుతీ సుజుకి రూరల్ సేల్స్ వాల్యుమ్ 17 శాతం నుంచి 38 శాతం పెరిగింది. కొత్త ప్రొడక్ట్‌‌‌‌ల లాంచ్‌‌‌‌తో మారుతీ సుజుకి దేశీయ మార్కెట్ షేరు కూడా  45 శాతం నుంచి 51 శాతానికి పెంచుకుంది. ఇండియాలో 6 లక్షల 30 వేల గ్రామాలున్నాయి. 65 శాతం మంది ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. రూరల్ ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌పై కూడా మారుతీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇండిపెండెంట్ డీలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌లపై ఎక్కువగా ఖర్చు పెట్టడం ప్రారంభించింది. 12 వేల మంది రూరల్ సేల్స్ డెవలప్‌‌‌‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌లను  నియమించింది. వీరు రూరల్ ప్రాంతాల్లో కంపెనీ సేల్స్‌‌‌‌ను పెంచేందుకు సహకరిస్తున్నారు. వీరు గ్రామాలను సందర్శిస్తూ.. టూవీలర్స్,  ట్రాన్స్‌‌‌‌పోర్టేషన్, ఇతర ఎకనమిక్ యాక్టివిటీల సేల్స్‌‌‌‌ను ట్రాక్ చేస్తారు. అంతేకాక లోకల్ ఇన్‌‌‌‌ఫ్లూయర్స్‌‌‌‌తో మంచి సంబంధాలు పెట్టుకుంటారు. రూరల్ ప్రాంత ప్రజలు పెద్ద పెద్ద షోరూంలకు రావడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు కట్టి, వారితో పర్సనల్ కాంటాక్ట్ పెట్టుకుని కంపెనీపై నమ్మకాన్ని ఏర్పాటు చేస్తారు.