Maruti Suzuki Invicto: మార్కెట్‌లోకి మారుతి సుజుకీ ఇన్విక్టో..

Maruti Suzuki Invicto: మార్కెట్‌లోకి మారుతి సుజుకీ ఇన్విక్టో..

భారతీయులు అమితంగా ఇష్ట పడే కార్లంటే.. మారుతి సుజుకీనే. రోడ్లపై కొన్ని వేల సంఖ్యలో మారుతి కార్లు రయ్ రయ్ మని పరుగులు పెడుతుంటాయి. ఆ విశ్వాసాన్ని అలానే కొనసాగిచేందుకు మారుతి సుజుకీ కొత్తగా.. మల్టీ పర్పస్ వెహికిల్(ఎంపీవీ) ఇన్విక్టోను మార్కెట్లోకి తెచ్చింది. ఎంపీవీ సెగ్మెంట్‌లో మారుతి సుజుకీ రావడం ఇదే ప్రథమం. 

మారుతి ఇన్విక్టోను మూడు వేరియంట్లలో లాంచ్ చేశారు. వేరియంట్‌ను బట్టి ధర రూ. 24.79 లక్షల నుంచి రూ. 28.42 లక్షల మధ్య  ఉంది.  జెటా+(7 సీటర్‌) ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.24.79 లక్షలు కాగా, జెటా+ (8 సీటర్‌) రూ. 24.84 లక్షలు, ఆల్ఫా+ (7 సీటర్‌) రూ.28.42 లక్షలకు అందుబాటులో ఉన్నాయి. ధర కాస్త ఎక్కువే అయినా లుక్  పరంగా చూస్తే అత్యంత స్టైలిష్‌గా, రాయల్‌గా అదరగొడుతోంది. 

ఈ కారు 4,755mm పొడవు, 1,850mm వెడల్పు, 1,795mm ఎత్తు ఉంది. నెక్సా బ్లూ, మిస్టిక్‌ వైట్‌, మెజిస్టిక్‌ సిల్వర్‌, స్టెల్లార్‌ బ్రాంజ్‌ కలర్స్ లో ఇది అందుబటులో కలదు. ఇన్విక్టోలో ఇంటెలిజెంట్‌ ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్‌ సిస్టమ్‌తో 2.0 లీటర్‌ ఇంజిన్‌ అందించారు. అలాగే ఈ సీవీటీ గేర్ బాక్స్ అమర్చారు. ఈ కారులో నార్మల్, స్పోర్ట్, ఎకో అనే మూడు రకాల డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇన్విక్టో 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని కేవలం 9.5 సెకన్లలో అందుకోగలదు. లీటర్ కు కనీసం 22 కి.మీ.ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. నెక్సా షోరూంలలో ఈ కారు కొనుగోలు చేయవచ్చు. ఇన్నోవాని ఇష్టపడే వారికి ఇది ప్రత్యామ్నాయం.