
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 లక్షల వెహికల్స్‌ను ఎగుమతి చేస్తామని మారుతి సుజుకీ అంచనా వేస్తోంది. 2030 నాటికి 8 లక్షల యూనిట్లను ఎగుమతి చేస్తామని తెలిపింది. 100 కి పైగా దేశాల్లో మరిన్ని మోడల్స్‌ను లాంచ్ చేస్తామని వెల్లడించింది. అలానే డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను మెరుగుపరుచుకోవడంపై ఫోకస్ పెట్టామంది. ‘మూడేళ్ల కిందటి వరకు మా ఎగుమతులు ఏడాదికి 1–1.2 లక్షల యూనిట్ల మధ్య ఉండేవి. బిజినెస్ ప్లాన్‌లో భాగంగా ఈ నెంబర్ పెంచడంపై ఫోకస్ పెట్టాం. 2022–23 లో 2.59 లక్షల బండ్లను ఎగుమతి చేయగలిగాం. 2023–24 లో 2.83 లక్షల యూనిట్లను ఎగుమతి చేశాం’ అని కంపెనీ పేర్కొంది.