
న్యూఢిల్లీ: లెజెండరీ బాక్సర్ ఎంసీ మేరీకోమ్ పారిస్ ఒలింపిక్స్ ఇండియా చెఫ్ డి మిషన్ బాధ్యతల నుంచి తప్పుకుంది. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఇలాంటి అరుదైన అవకాశాన్ని చేజార్చుకుంటున్నందుకు ఇబ్బందికరంగా అనిపిస్తున్నా తనకు మరో మార్గం లేదని తెలిపింది. చెఫ్ డి మిషన్ బాధ్యతల నుంచి తప్పించాలని కోరుతూ మేరీకోమ్ తనకు లెటర్ రాసిందని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ప్రెసిడెంట్ పీటీ ఉష వెల్లడించింది లెటర్ అందిన వెంటనే మేరీకోమ్‌తో మాట్లాడానని ఉష తెలిపింది. తన విజ్ఞప్తిని, నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని స్పష్టం చేసింది. మేరీ స్థానంలో కొత్తగా ఎవరికి ఈ బాధ్యతలు అప్పగించాలనే దానిపై త్వరలో ప్రకటిస్తామని ఉష తెలిపింది.