కరోనా వ్యాక్సిన్ 60 శాతం పనిచేస్తే మాస్క్ 90 శాతం పనిచేస్తుంది

కరోనా వ్యాక్సిన్ 60 శాతం పనిచేస్తే మాస్క్ 90 శాతం పనిచేస్తుంది

కరోనా ను తగ్గించడంలో వ్యాక్సిన్ కంటే మాస్క్ బాగా పనిచేస్తుంది. మాస్క్ ధరించిన 90 శాతం మందిలో కరోనా తగ్గిందని రాజస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రి రఘుశర్మ తెలిపారు. పబ్లిక్ ప్లేసుల్లో, మాట్లాడే సమయంలో ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాలని సూచించారు.మహమ్మారి కరోనా కు చెక్ పెట్టే వ్యాక్సిన్ ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరికి మాస్కే శ్రీరామరక్ష అని తెలిపారు.

ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా 60శాతం కంటే ఎక్కువగా ప్రభావం చూపించదు. కానీ రెగ్యులర్ గా మాస్క్ ధరించడం వల్ల 90శాతం వరకు మనం కరోనా నుంచి సురక్షితంగా ఉండొచ్చని రాజస్థాన్ హెల్త్ మినిస్టర్ రఘుశర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం కోటి వరకు మాస్క్ లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపిన ఆయన..అక్టోబర్ 29న రాష్ట్రానికి చెందిన మూడు పట్టణాల్లో జరిగే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.