కరోనా అరికట్టేందుకు మాస్కులు తప్పనిసరి: WHO

కరోనా అరికట్టేందుకు మాస్కులు తప్పనిసరి: WHO

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఫేస్‌ మాస్క్ తప్పనిసరి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కొత్త సూచన చేసింది. ప్రజల మధ్య ఉన్న సమయంలో.. ముఖానికి మాస్క్ ను పెట్టుకోవాలని సూచించింది. వైరస్‌ వెూసుకెళ్తున్న తుంపర్ల నుంచి మాస్క్‌ రక్షణ కల్పిస్తుందని WHO తన లేటెస్టు సూచనల్లో చెప్పింది. వాస్తవానికి కొన్ని దేశాలు ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్క్‌ పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి. ఆరోగ్యంగా ఉన్న ప్రజలు కూడా మాస్క్‌ పెట్టుకోవాలన్న ఆధారాలు తమ దగ్గర ఏవిూ లేవని గతంలో డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. వైరస్‌ వ్యాప్తి జరిగే రిస్క్‌ ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా మాస్క్ ను పెట్టుకోవాలని డబ్ల్యూహెచ్‌వో టెక్నికల్‌ నిపుణులు డాక్టర్‌ మారియా వాన్‌ కెర్కోవ్‌ తెలిపారు. అనారోగ్యంగా ఉన్న వారు మెడికల్‌ ఫేస్‌ మాస్క్ లను ధరించాలన్నారు. కరోనా వైరస్‌ ఎలా ఎటాక్ చేస్తుందో.. ఎక్కడ నుంచి వచ్చి సోకుతుందో తెలియని పరిస్థితి ఉందని WHO చెప్పింది.