జోరుగా మట్టి విగ్రహాల పంపిణీ

జోరుగా మట్టి విగ్రహాల  పంపిణీ

వెలుగు నెట్​వర్క్​: గణపతి నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం నగరంలో పలు సంఘాల ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ  జోరుగా సాగింది. బంజారాహిల్స్​లో మేయర్​ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ కమిషనర్​ నర్సయ్య మట్టి గణపతులను పంపిణీ చేశారు. నాచారం మహాకాళి సహిత మహా కాలేశ్వరస్వామి  దేవస్థానం వద్ద ఎస్ఎస్ఎస్ యువసేన, యూత్​ కాంగ్రెస్​ లీడర్​ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ కాంగ్రెస్ ఇన్​చార్జి  పరమేశ్వర్ రెడ్డి, శంషాబాద్ మున్సిపాలిటీ ఆర్ బీ నగర్ కాలనీలో సీఐ బాలరాజు, సికింద్రాబాద్ సోమ సుందరం వీధిలో  మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్​, రంగారెడ్డి కలెక్టరేట్​లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కలెక్టర్​ సి.నారాయణరెడ్డి, వికారాబాద్​ కలెక్టరేట్​లో అడిషనల్​ కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి, రాంమందిరం వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో, రాంనగర్​లోని గుండు లలితానగర్​లో శ్రావణి ఎంటర్​ప్రైజెస్​ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను భక్తులకు ఉచితంగా అందజేశారు. 

విగ్రహాల కోసం ఎగబడ్డ జనం

హైదరాబాద్​సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద అధికారులు మట్టి విగ్రహాలు పంపిణీ చేయగా జనం ఎగబడ్డారు. డీసీఎం నుంచి విగ్రహాలను తీసి ఇస్తున్న క్రమంలో ఒకరిని ఒకరు తోసుకున్నారు. జీహెచ్ఎంసీ నగర వ్యాప్తంగా 2 లక్షల మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తామని చెప్పింది.   ఆదివారం నుంచి పంపిణీ చేయాల్సి ఉండగా.. మంగళవారం అందజేయడంతో ప్రజలు ఎగబడ్డారు.