
బీహార్ : పబ్లిక్ ఎగ్జామ్స్ లో మాస్ కాపీయింగ్ కు మారు పేరు బీహార్. ఆ రాష్ట్రంలో ఇంకా పరీక్షలో కాపీ కొట్టడాన్ని ఆపలేకపోతోంది ప్రభుత్వం. ముజఫర్ పూర్ లో నిర్వహించిన పోలీస్ రిక్రూట్ మెంట్ ఎగ్జామ్ లోనూ కాపీయింగ్ కు ప్రయత్నించి కొందరు దొరికిపోయారు. వారిని చెక్ చేసిన పోలీసులకు దిమ్మదిరిగింది.
మైక్రోఫోన్లు, ఇయర్ పిన్స్ తో ఎగ్జామ్ కు వచ్చారు అభ్యర్థులు. హెడ్ సెట్ ను బనియన్ కు ప్లాస్టర్ తో అటాచ్ చేసి ఫోన్లను కూడా ఎగ్జామ్ హాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అభ్యర్థులు. పోలీసులు తనిఖీలు చేస్తుండగా అవన్నీ బయటపడ్డాయి.
See Also: బీజేపీ ఆఫీస్ ను తగలబెట్టారు