పరీక్షల్లో మాస్ కాపీయింగ్.. ఎక్కడ చూసిన దర్శనమిస్తున్న చిట్టీలు..

పరీక్షల్లో మాస్ కాపీయింగ్.. ఎక్కడ చూసిన దర్శనమిస్తున్న చిట్టీలు..

నిర్మల్ జిల్లాలో మాస్ కాపియింగ్ బట్టబయలైంది. కాకతీయ యూనివర్సీటి డిగ్రీ పరీక్షలో జోరుగా సాగుతుంది మాస్ కాపియింగ్. యధేశ్ఛగా విద్యార్ధులు మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్నా,చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు అబ్జర్వర్లు. కాలేజీ అవరణలో ఎక్కడ చూసిన జవాబు మైక్రో జిరాక్స్ చిట్టిలే దర్శనమిస్తున్నయి. ఇచ్చోడలో పక్కా డీల్ చేసుకుని మరి మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్నారు యాజమాన్యాలు.

మా విద్యార్థులను మీరు చూసుకోండి, మీ విద్యార్థులను మేము చూసుకుంటామనే ఒప్పందంలో భాగమే ఇదంతా అనే చర్చ కూడా నడుస్తోంది. ఈ క్రమంలోనే అబ్జర్వర్లు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇంతజరుగుతున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.