ఓటు కోసం కాదు.. భవిష్యత్ కోసం నిలబడే నాయకుడు కావాలి: బోయపాటి శ్రీను

ఓటు కోసం కాదు.. భవిష్యత్ కోసం నిలబడే నాయకుడు కావాలి: బోయపాటి శ్రీను

మాస్ చిత్రాలు దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu) ఓటింగ్ అండ్ ఎలక్షన్స్ పై సంచనల కామెంట్స్ చేశారు. ఎలక్షన్స్ లో వోటింగ్ కోసం కాదు భవిష్యత్ కోసం నిలబడే నాయకుడు కావాలని ఆయన అన్నారు. ప్రస్తుతం బోయపాటి చేసిన ఈ కామెంట్స్ చర్చనియ్యాంశం అయ్యాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. తాజాగా గుంటూరు జిల్లాలోని ఆర్ వీ ఆర్ & జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో టెక్నికల్,కల్చరల్ స్పోర్ట్స్ టెస్ట్ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు ముఖ్య అతిధిగా దర్శకుడు బోయపాటి శ్రీను హాజరయ్యారు. 

ఇందులో భాగంగా బోయపాటి మాట్లాడుతూ.. నేను కూడా ఇదే కళాశాలలో చదివానని, ప్రతీ విద్యార్థికి బ్యాలెన్సింగ్ ఉండాలని అన్నారు. అరచేతిలో ప్రపంచాన్ని చూపించే సత్తా కేవలం ఇంజనీర్లకు మాత్రమే ఉందని, ఆ సత్తాను దేశ ప్రగతి కోసం ఉపయోగించాలని సూచించారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా, ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లితండ్రులను మరవకూడదని తెలిపారు. రాబోయే కాలానికి విద్యార్థులే ముఖ్యం అని, ప్రతీ విద్యార్థి పోలింగ్ బూత్ కు వెళ్లాలని, ఓటు కోసం కాకుండా.. భవిష్యత్ కోసం నిలబడే నాయకుడిని ఎన్నుకోవాలని ఆయన కోరారు. నా ప్రతీ సినిమాల్లో అలాంటి ఒక ఎలిమెంట్ ఉంటుందని గుర్తుచేశారు. ప్రస్తుతం బోయపాటి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. 

ఇక బోయపాటి శ్రీను సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ఆయన రామ్ హీరోగా స్కంద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫిస్ దగ్గర మంచి విజయాన్నే సాధించింది. ఈ సినిమా తరువాత బోయపాటి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో  సినిమా చేయనున్నాడు. ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమాలో హీరోగా ఎవరు చేయనున్నారు అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.