యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా శనివారం దేవస్థానం ఆధ్వర్యంలో ‘సామూహిక గిరిప్రదక్షిణ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెల్లవారుజామున ఉదయం 5:30 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద నరసింహస్వామి పాదాలకు భక్తులతో కలిసి ఆలయ ఈవో భవానీ శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి గిరిప్రదక్షిణ ఆరంభించారు. కొండపైకి చేరుకుని గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాగా, దేవస్థానంలో అష్టోత్తర శతఘటాభిషేకాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
