శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అక్టోబర్ 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా తన క్యారెక్టర్ గురించి రవితేజ ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఇందులో తాను పోషించిన ఆర్‌పీఎఫ్ (రైల్వే పోలీస్ ఫోర్స్) పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు.
ఇది తన సినీ ప్రయాణంలోనే సరికొత్తగా ఉంటుందన్నారు. కామెడీ, మాస్ ఎలిమెంట్స్‌తోపాటు కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని చెప్పారు. దర్శకుడు భాను టేకింగ్, భీమ్స్ మ్యూజిక్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని అన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.
