RaviTeja: భారీగా రెమ్యూనరేషన్‌ తగ్గించుకున్న రవితేజ.. అసలు కారణం ఇదేనా?

RaviTeja: భారీగా రెమ్యూనరేషన్‌ తగ్గించుకున్న రవితేజ.. అసలు కారణం ఇదేనా?

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ అంటేనే అన్‌లిమిటెడ్ ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించడంలో ఆయన స్టైలే వేరు. అయితే, గత కొంతకాలంగా రవితేజకు టైమ్ అంతగా కలిసిరావడం లేదు. వరుసగా పరాజయాలను మూటగట్టుకుట్టుకోవడంతో దాని ప్రభావం ఆయన మార్కెట్ పై కూడా పడింది. కానీ ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుత ట్రెండ్‌ను, మార్కెట్ సమీకరణాలను గమనించిన రవితేజ.. సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

నిర్మాతలకు ఊరట..

సాధారణంగా హిట్లు వస్తే రెమ్యూనరేషన్ పెంచడం, ఫ్లాపులు వచ్చినా అదే పారితోషికాన్ని డిమాండ్ చేయడం స్టార్ హీరోలకు అలవాటు. కానీ వరుస డిజాస్టర్ల వల్ల తనను నమ్ముకున్న నిర్మాతలు నష్టపోకూడదని, వారిపై అదనపు భారం పడకూడదని భావించి రవితేజ భారీ త్యాగానికి సిద్ధపడ్డారు. గతంలో ఒక సినిమాకు దాదాపు రూ. 25 కోట్ల వరకు తీసుకున్న  మాస్ మహారాజా, ఇప్పుడు తన రెమ్యూనరేషన్‌ను ఏకంగా రూ. 15 కోట్లకు తగ్గించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది. తన మార్కెట్ మళ్ళీ ట్రాక్‌లోకి వచ్చే వరకు నిర్మాతలను సేఫ్ జోన్‌లో ఉంచాలనే ఆయన నిర్ణయంపై టాలీవుడ్‌లో ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఆశలన్నీ ‘ఇరుముడి'పైనే..

రెమ్యూనరేషన్ తగ్గించడమే కాదు.. కథల ఎంపికలోనూ రవితేజ ఇప్పుడు రూట్ మార్చారు. రొటీన్ కమర్షియల్ ఫార్ములా పక్కనపెట్టి కంటెంట్ నమ్ముకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇరుముడి’. సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.  ఈ సినిమాలో రవితేజ కెరీర్‌లోనే ముందెన్నడూ చూడని ఒక విలక్షణమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన తొలిసారిగా అయ్యప్ప స్వామి భక్తుడి పాత్రను పోషిస్తుండటం విశేషం. నల్లని దుస్తులు, మెడలో మాల, నుదుట విభూతి-కుంకుమతో ఉన్న రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.

ఎమోషనల్ థ్రిల్లర్.. 

శివ నిర్వాణ అంటేనే బలమైన భావోద్వేగాలను వెండితెరపై పండించడంలో దిట్ట. ‘ఇరుముడి’ చిత్రం కేవలం ఆధ్యాత్మికత, యాక్షన్ మాత్రమే కాకుండా.. ఒక తండ్రీకూతురి మధ్య సాగే బలమైన ఎమోషనల్ బాండింగ్ చుట్టూ తిరగబోతోంది. ఇందులో రవితేజ భార్యగా ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా, కూతురి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర నటిస్తోంది. ఈ ఇరుముడి' ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ కొడితే, మాస్ మహారాజా మళ్లీ ఫామ్‌లోకి రావడం ఖాయం అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  మరి రవితేజ చేస్తున్న ఈ సరికొత్త ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.