సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

జయశంకర్​భూపాలపల్లి/ భూపాలపల్లి రూరల్/ మహదేవ్​పూర్, వెలుగు​​ : సరస్వతి పుష్కర స్నానం చేసేందుకు భక్తులు పోటెత్తారు. ఐదో రోజు సోమవారం కాళేశ్వరానికి లక్షలాదిగా తరలివచ్చారు. పుష్కర స్నానం చేసి, కాళేశ్వర, ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర హైకోర్టు జడ్జి నర్సింగరావు, ప్రభుత్వ విప్, డోర్నకల్​ ఎమ్మెల్యే రామచంద్రునాయక్​ దంపతులు పుష్కర స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లను కలెక్టర్​ రాహుల్​శర్మ పరిశీలించారు. సింగరేణి సంస్థ సహకారంతో మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. కాగా, డ్యూటీలో ఉన్న హెడ్​ కానిస్టేబుల్​ పాండు నాయక్​కు గుండెపోటు రావడంతో స్పృహతప్పి పడిపోయాడు. విషయం తెలుసుకున్న పల్లె దవాఖాన డాక్టర్​ రఘురామ్​ అక్కడకు చేరుకుని సీపీఆర్​ చేసి ప్రాణాలు రక్షించారు. అనంతరం 108లో మహదేవ్​పూర్​ సీహెచ్​సీకి తరలించారు.