ఛత్తీస్‪ఘడ్ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ గ్రేహౌండ్స్, మావోయిస్టుల మృతదేహాలు

ఛత్తీస్‪ఘడ్ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్  గ్రేహౌండ్స్, మావోయిస్టుల మృతదేహాలు

రాష్ట్రంలోని ఛత్తీస్‪ఘడ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతంలో గురువారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. గుండాల మండలం దామరతోగు అడవుల్లో పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పలువురికి గాయాలు కూడా అయినట్లు సమాచారం. బుధవారం అర్ధరాత్రి తర్వాత మావోయిస్టులకు గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి.

Also Read :- రైతుల కష్టం గంగపాలు

మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న నాయకత్వంలో ఈ ప్రాంతంలో మావోయిస్టులు తిరుగుతున్నట్లు గ్రేహౌండ్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. గతంలో ఇదే ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి చెందారు. గత కొంతకాలంగా చత్తీస్గడ్ నుంచి వచ్చిన లచ్చన్న నాయకత్వంలోని దళం మణుగూరు ఏరియాలోనే కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. కాల్పుల్లో లచ్చన్నతో సహా దళం మొత్తం మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. గ్రేహౌండ్స్ కానిస్టేబుల్స్ కూడా ఇద్దరు మృతి చనిపోయారు. అంబులెన్స్ లో మృతదేహాలను భద్రాచలం ఆసుపత్రికి తరలిస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.