ఏపీలో క్రాకర్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు... ఆరుగురు సజీవ దహనం

ఏపీలో క్రాకర్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు... ఆరుగురు  సజీవ దహనం

అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ ,ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రాయవరం సమీపంలోని శ్రీగణపతి ఫైర్ వర్క్స్ క్రాకర్స్ తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. 

ఈ ఘటనలో 8 మంది సజీవ దహనమయ్యారు. మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి.వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తర లించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మందుగుండు తయారు చేస్తుండ గా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది, అధికారులు స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసిన రాయవరం పోలీసులు  విచారణ చేస్తున్నారు.