అసిఫాబాద్ భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత...

అసిఫాబాద్ భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత...

కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. మే 27వ తేదీ ఆదివారం చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామ శివారులో పాల సముద్రం చెట్ల పొదలో దాచి పెట్టిన నకిలీ విత్తనాలను పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పట్టుకున్నారు. 

మూడు క్వింటాళ్ల ఇరవై అయిదు కిలోల నకిలీ పత్తి విత్తనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.  గంగాపూర్ గ్రామానికి చెందిన చాపిలే పురుషోత్తం, భూపాల పట్నం గ్రామానికి చెందిన బొల్ల బోయిన అశోక్ అనే ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.