
ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జూన్ 5వ తేదీ బుధవారం దక్షిణ ఢిల్లీలోని లజ్‌పత్ నగర్‌లోని ఐ7 చౌదరి ఐ సెంటర్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
ఈ ప్రమాదంపై ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (DFS) అధికారి మాట్లాడుతూ... ఉదయం 11.30 గంటలకు అగ్నిప్రమాదానికి సంబంధించిన కాల్ వచ్చింది. వెంటనే 12 ఫైర్ టెండర్స్ తో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆదపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు అని తెలిపారు. ఈఘటనకు సంబంధించిన కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోందని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.