
గుజరాత్ వల్సాద్ జిల్లాలోని స్క్రాప్ గోడౌన్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. వాపిలోని 10 స్క్రాప్ గోడౌన్‌లలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయని... దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు అధికారులు.