అపార్ట్ మెంట్లో మంటలు..14 మంది మృతి

అపార్ట్ మెంట్లో మంటలు..14 మంది మృతి

జార్ఖండ్  ధన్ భాద్ లోని ఆశీర్వాద్ అపార్ట్ మెంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  14 మంది సజీవ దహనం అయ్యారు. వీరిలో 10 మంది మహిళలు, ముగ్గురు పిల్లలు, ఓ వ్యక్తి ఉన్నారు.  13 అంతస్తుల అపార్ట్ మెంట్ లో   ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫస్ట్ రెండో అంతస్తులో మొదలైన మంటలు ఆ తర్వాత మిగతా అంతస్తులకు వ్యాపించాయి.  ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఈ   అపార్ట్ మెంట్ లో 400 మందికి పైగా ఉంటున్నారని తెలుస్తోంది. ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్  కొనసాగుతోందని ధన్ బాద్ డిప్యూటీ కమిషనర్  తెలిపారు.