ఢిల్లీలో తాజ్ ఎక్స్‌ప్రెస్‌కి భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీలో తాజ్ ఎక్స్‌ప్రెస్‌కి భారీ అగ్ని ప్రమాదం

తాజ్ ఎక్స్‌ప్రెస్ రైల్వే బోగీలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఓఖ్లా నుంచి తుగ్లకాబాద్ బ్లాక్ సెక్షన్‌కు వెళ్తున్న 2280 తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్‌లో మంటలు చెలరేగాలు. సరితా విహార్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈరోజు సాయంత్రం 4గంటల సమయంలో ట్రైన్ లగేజీ కంపార్ట్ మెంట్ లో కొద్ది సేపటికే నాలుగు బోగీలు పొగతో కమ్ముకుపోయి మంటలు వ్యాపించాయి. 

రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఫైర్ ఇంజన్లను పిలిపించారు. లగేజీ కంపార్ట్ మెంట్ బోగీలను ట్రైన్ నుంచి వేరు చేశారు. 8 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పుతున్నాయి. ఢిల్లీ జిల్లా మేజిస్ట్రేట్, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఉపిరిపీల్చుకున్నారు.