ముంబై:ముంబైలోని జోగేశ్వరీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం జూలై 24, 2024న జోగేశ్వరీ ప్రాంతంలో ఎత్తయిన భవనంలోని 15 వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెల రేగాయి. మంటలతోపాటు దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి.
విద్యుత్ తీగలకు మంటలకు అంటుకొని కింది అంతస్తుల్లోకి కూడా మంటలు వ్యాపించాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలక్ట్రిక్ డక్ట్ చెక్క తలుపులు తగలబడిపోయాయి. దీంతో భవనంలో నివాసముంటున్న ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. మంటలను తప్పించుకునే ప్రయత్నంతో నలుగురి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ALSO READ | Mumbai Local Trains: ముంబైలో అంతే : రైలు పట్టాలపై నడుచుకుంటూ ఆఫీసులకు జనం !
భవనంలో పై అంతస్తుల్లో ఉన్న నలుగురు వ్యక్తులకు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. వారిలో ముగ్గురిని ఎస్ బీఎష్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మరో వ్యక్తిని కేజే కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్పత్రిలో చేర్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
