అచ్చంపేటలో భారీ అగ్ని ప్రమాదం

అచ్చంపేటలో భారీ అగ్ని ప్రమాదం

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫిబ్రవరి 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం అచ్చంపేటలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం సమీపంలో శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న పాత సామాన్ల దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజన్ తో మంటలను అదుపు చేశారు. 

ఈ ప్రమాదంలో దాదాపు రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.  ఓ గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ కాల్చి పడేయడంతోనే మంటలు చెలరేగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.