ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ అగ్నిప్రమాదం.. పవర్ స్టేషన్‍లో ఎగిసిపడుతున్న మంటలు

ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ అగ్నిప్రమాదం.. పవర్ స్టేషన్‍లో ఎగిసిపడుతున్న మంటలు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాయ్‌పూర్‌లోని కోట ప్రాంతంలోని విద్యుత్ పంపిణీ సంస్థలో ఏప్రిల్ 5 మధ్యాహ్నం పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పవర్‌ స్టేషన్ చుట్టు పక్కల ప్రాంతాలకు దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలు, పొగ కారణంగా ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. యంత్రాలతో నీల్లు చల్లుతూ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలో దట్టమైన పొగతో నిండిన పవర్‌ స్టేషన్‌పై అగ్నిమాపక సిబ్బంది పైపులతో నీళ్లు చల్లుతూ మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. పవర్ స్టేషల్ లో ఎంతమంది ఉన్నారనేది ఇంకా తెలియలేదు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.