గన్ కల్చర్ పై అమెరికన్ల నిరసన

గన్ కల్చర్ పై అమెరికన్ల నిరసన

అమెరికాలో ఇప్పటికే గన్ కల్చర్ పై జనంలో తీవ్ర ఆందోళన ఆగ్రహం కనిపిస్తోంది. వరుస ఘటనలతో ఎప్పుడు ఏ తుపాకీ పేలుతుందోనన్న టెన్షన్ తో ఉన్నారు. లేటెస్ట్ గా చికాగోలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. అందరినీ హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. మరోవైపు కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించే పనిలో చికాగో పోలీసులు ఉన్నారు. కారు నుంచి దిగి గన్ ఫైర్ చేసినట్లు చెబుతున్నారు. ఓ వైపు సేవ్ అవర్ లైవ్స్ పేరుతో అమెరికన్లు గన్ కల్చర్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంటే.. ఇంకోవైపు ఇలాంటి గన్ షూటింగ్ లు జరుగుతున్నాయి. 

గన్ కల్చర్ ను వ్యతిరేకిస్తూ అమెరికాలో భారీ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. మార్చ్ ఫర్ అవర్ లైవ్స్ పేరిట ఆందోళన చేస్తున్నారు. ఇటీవల అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోయింది. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. గన్ కల్చర్ నియంత్రణపై చర్యలు తీసుకోవాలని పౌరులు డిమాండ్ చేస్తున్నారు. కాల్పుల నుంచి ఫ్రీడం కావాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఆందోళనకారులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మద్దతిచ్చారు. కామన్ సెన్స్ గన్ సేఫ్టీ చట్టాన్ని ఆమోదించాలని కాంగ్రెస్ కు పిలుపునిచ్చారు జో బైడెన్.

టెక్సాస్ లో...

టెక్సాస్ లోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో మే 24న కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 19 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే బఫెలో, న్యూయార్క్ లో జరిగిన దాడిలో 10 మంది చనిపోయారు. గన్ కల్చర్ పెరగడం వల్లే దాడులు జరుగుతున్నాయని ఆందోళనకారులు తెలిపారు. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, చికాగోతో సహా దేశ వ్యాప్తంగా దాదాపు 450 ప్రాంతాల్లో ర్యాలీలు జరుగుతాయని నిరసన కారులు తెలిపారు. ప్రజలు చనిపోతుంటే రాజకీయనాయకులను ఇంట్లో కూర్చొనిచ్చే పరిస్థితే లేదని ఆందోళనకారులు తెలిపారు. దేశంలో ప్రస్తుతం మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. గన్ కల్చర్ ను నియంత్రించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు.