పోటెత్తారు : శబరిమల అయ్యప్ప దర్శనం 20 గంటలు

పోటెత్తారు : శబరిమల అయ్యప్ప దర్శనం 20 గంటలు

కేరళలోని శబరిమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.   ఎప్పడులేనంతంగా  దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో శబరిమల ఆలయ ప్రాంగణమంతా అయ్యప్ప స్వాములతో కిటకిటలాడింది.   దర్శనం కోసం గంటల తరబడి భక్తులు క్యూ లైన్లో నిల్చున్నారు.  స్వామివారి  దర్శనానికి 20 గంటల సమయం పడుతుంది.  క్యూ లైన్లో ఆహారం, నీరు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు.  ఆలయ ప్రాంగణంలో కిక్కిరిసిన భక్తులతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈదుర్ఘటనలో ఒకరు చనిపోయారు. 

ప్రతి ఏటా శబరిమలలోని అయ్యప్పస్వామి దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలోనే వస్తుంటారు. . 41రోజుల పాటు నియమ, నిష్టలతో పూజించి ఇరుముడి కట్టుకొని శబరిమలకు చేరుకుంటారు. ఇక్కడ అయ్యప్పకు దర్శనం చేసుకొని ఇరుముడి తీస్తారు.  అయితే ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగింది.   డిసెంబర్ 6 నుండి శబరిమలను సందర్శించే యాత్రికుల సంఖ్య బాగా పెరిగింది. అందుకు తగ్గట్గుగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో  భక్తులకు ఇబ్బందులు మొదలయ్యాయి.   

ఈ క్రమంలో కేరళ సర్కార్‌‌ తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. కనీసం భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో పినరయ్ సర్కార్ విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.   శబరిమల తాజా పరస్థితులపై  జోక్యం చేసుకున్న హైకోర్టు భక్తులకు కనీస సౌకర్యాలను కలిపించాలని కేరళ సర్కారును ఆదేశించింది.   శబరిమలలో అయ్పప్ప భక్తుల తాకిడి మకరజ్యోతి వరకు ఉంటుంది.  ఈ రెండు నెలల మధ్య కాలంలో శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి దక్షిణ మధ్య రైల్వే 51 ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసింది.