నెల్లూరులో ఘోరం: రోడ్డు పక్కన షాపులపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు స్పాట్ డెడ్

నెల్లూరులో ఘోరం: రోడ్డు పక్కన షాపులపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు స్పాట్ డెడ్

నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న షాపులపైకి లారీ దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మంగళవారం ( నవంబర్ 11 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... నెల్లూరు నగరం సమీపంలో ఉన్న ఎన్టీఆర్ నగర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న షాపులపైకి లారీ దూసుకెళ్లడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఘటన జరిగిన స్థలం దగ్గర మృతదేహాలు షాపుల సామాగ్రి చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదం జరిగిన సమయంలో హైవేపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని అంటున్నారు స్థానికులు.

►ALSO READ | శ్రీశైలంలో స్టార్ హోటల్ నిర్మాణానికి శంకుస్థాపన.. వర్చువల్ గా పాల్గొన్న సీఎం చంద్రబాబు..