శ్రీశైలంలో స్టార్ హోటల్ నిర్మాణానికి శంకుస్థాపన.. వర్చువల్ గా పాల్గొన్న సీఎం చంద్రబాబు..

శ్రీశైలంలో స్టార్ హోటల్ నిర్మాణానికి శంకుస్థాపన.. వర్చువల్ గా పాల్గొన్న సీఎం చంద్రబాబు..

నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో శ్రీ వెంకటేశ్వర గ్రూప్స్ నిర్మించనున్న 4 స్టార్ హోటల్ భవనానికి భూమి పూజ నిర్వహించారు. మంగళవారం ( నవంబర్ 11 ) జరిగిన ఈ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాతో కలిసి రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

ALSO READ : ముక్తి కలగాలంటే .. ఈ లక్షణాలు ఉండాల్సిందే..

శ్రీశైలం దేవస్థానానికి విచ్చేసే భక్తులకు ఆధునిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో ఈ 4 స్టార్ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు మంత్రి జనార్దన్ రెడ్డి.ఈ భూమి పూజ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ పి. రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసులు, శ్రీ వెంకటేశ్వర గ్రూప్స్ వ్యవస్థాపకులు రామస్వామి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.