రంగారెడ్డి జిల్లాలో ఘోరం జరిగింది. బైకును లారీ ఢీకొన్న ఘటనలో డ్యూటీకి వెళ్లొస్తున్న జూనియర్ లైన్ మెన్ మృతి చెందాడు. బుధవారం ( నవంబర్ 5 ) రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి దగ్గర ఘోర ప్రమాదం. ఆగపల్లి దగ్గర నాగార్జున హైవేపై బైకును లారీ ఢీకొనడంతో డ్యూటీకి వెళ్లొస్తున్న జూనియర్ లైన్ మెన్ ముజాయత్ మృతి చెందాడు. మృతుడు యాచారం మండలం మేడిపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ముజాయత్ కొత్తూరు లో జూనియర్ లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. విధులు ముగించుకొని వెళ్తుండగా బుధవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మంచాల పోలీసులు. ముజాయత్ మరణంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ముజాయత్ మరణానికి కారణమైన లారీ డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బంధువులు.
ఇదిలా ఉండగా.. వికారాబాద్ లో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. వికారాబాద్పట్టణానికి చెందిన దంపతులు పింజరి భారతి–తులసీరామ్మంగళవారం రాత్రి స్కూటీపై వెళ్తుండగా రాజీవ్‌కాలనీ సమీపంలో ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భారతి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందింది.
అంతకుముందు ఆ కారు రోడ్డు పక్కనున్న లక్ష్మణ్, శ్రీనివాస్, చిన్నాను ఢీకొట్టడంతో వారు కూడా గాయపడ్డారు. వికారాబాద్పట్టణానికే చెందిన ముత్తరగళ్ల మహేశ్మద్యం మత్తులో అతివేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదాలు జరిగాయని సీఐ చెప్పారు. నిందితుడిని బుధవారం అరెస్ట్‌చేసి, రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
