బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భారీ చోరీ

బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భారీ చోరీ

బాసర: నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. అమ్మవారి ప్రధాన ఆలయం వెనుక ఉండే మహంకాళి ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ తాళాలు పగలగొట్టి మహంకాళి అమ్మవారి కిరీటం, హుండీ ఎత్తుకెళ్లారు. వేకువ జామునే సుప్రభాత సేవ కోసం వెళ్ళిన అర్చకులు చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆలయం దగ్గరకు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నిర్మల్ జిల్లా బాసర. మహంకాళి ఆలయాన్ని ఎస్పీ జానకి  షర్మిల పరిశీలించారు. సీసీ కెమెరాలు  పరిశీలిస్తున్నామని, దొంగల వివరాలుసేకరిస్తున్నామని తెలిపారు. చోరీకి పాల్పడిన  హుండీని దొంగలు ఇక్కడే వదిలేసి వెళ్లిపోయారని.. దొంగలపై విచారణ కొనసాగుతోందని ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు.