2 లక్షలకు దగ్గరలో తులం బంగారం.. శామీర్ పేట వైపు ఉండేటోళ్లు జర భద్రం !

2 లక్షలకు దగ్గరలో తులం బంగారం.. శామీర్ పేట వైపు ఉండేటోళ్లు జర భద్రం !

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్‌గిరి కమిషన్ రేట్ పరిధిలోని శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మరాసిపేటలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన నాగేశ్వరరావు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు 20 తులాల బంగారం, 2 లక్షల డబ్బును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఇంటి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.

ఇటీవల బంగారం ధరలు అధికంగా పెరగడంతో శామీర్ పేట పీఎస్ పరిధిలో చైన్ స్కాచింగ్లు, వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు దుండగులు సవాల్ విసురుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు శామీర్ పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రోజురోజుకూ పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. మహిళకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. తులం బంగారం ధర లక్షా 82 వేల 490 రూపాయలకు చేరడంతో అంతర్రాష్ట్ర ముఠాలతో పాటు స్థానిక దొంగలు మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఒక్క స్నాచింగ్‌‌‌‌ చేస్తే  తక్కువలో తక్కువ రూ.2 నుంచి రూ.3 లక్షల దాకా చేతికి అందుతుండడంతో చైన్​స్నాచర్లు రెచ్చిపోతున్నారు. బైకులపై మెరుపు వేగంతో వచ్చి ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న మహిళలుసహా రోడ్డుపై నడిచివెళ్లే వారి మెడలోంచి పుస్తెల తాళ్లు, చైన్లు తెంపుకెళ్తున్నారు.

పట్టపగలే రెచ్చిపోతున్న దొంగలు.. అడ్డొస్తే హత్య చేసేందుకూ వెనుకాడడం లేదు. ముఖ్యంగా ఒంటరి, వృద్ధ మహిళలను టార్గెట్​చేసి చంపి మరీ బంగారం ఎత్తుకెళ్తున్నారు. ఇలాంటి కేసుల్లో ఎక్కువగా తెలిసినవాళ్లే ఘాతుకాలకు పాల్పడుతున్నారు. 

సంక్రాంతి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కనీసం 30కిపైగా చైన్​స్నాచింగ్‌‌‌‌లు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో తాజాగా బంగారం కోసం ఓ వృద్ధురాలిని హత్యచేయడం కలకలం రేపింది. దీంతో ఒంటరి మహిళలు జాగ్రత్తగా ఉండాలని, ప్రస్తుతం జరుగుతున్న జాతరలకు ఎట్టి పరిస్థితుల్లోనూ బంగారు నగలు వేసుకొని వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

దేశంలో ఎక్కడాలేని అడ్వాన్స్డ్ టెక్నాలజీ వినియోగిస్తున్నామని రాష్ట్ర పోలీసులు తరుచూ చెప్పుకుంటారు. దేశంలో ఉన్న మొత్తం సీసీటీవీ కెమెరాల్లో 60 శాతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగరంలోనే ఉండగా, కమాండ్​కంట్రోల్​ సెంటర్​ నుంచి నిరంతర పర్యవేక్షణ ఉంటున్నది. 

ఏదైనా నేరం జరిగితే గంటల వ్యవధిలోనే ఛేదించే స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవస్థ ఉంది. కానీ ఇవేవీ చైన్ స్నాచర్లకు అడ్డుకట్ట వేయడం లేదు. ప్రధానంగా అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెక్కీలు వేసి మరీ చోరీలు చేస్తున్నాయి. హై టెక్నాలజీ సీసీటీవీ కెమెరాలు ఉన్నా.. పట్టుకోండి చూద్దామంటూ పోలీసులకు సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విసురుతున్నాయి.

సీసీటీవీ కెమెరాల నిర్వహణ లోపాలు, రాత్రి సమయాల్లో బైక్ నంబర్లను గుర్తించే నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  లేకపోవడం చైన్ స్నాచర్లకు కలిసివస్తున్నది. స్నాచర్లు మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ధరించి ఉండడం,  బైక్ నంబర్ ప్లేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరిగా కనిపించకపోవడం సమస్యగా మారింది. 

ఒకవేళ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుర్తించినప్పటికీ.. అవి దొంగిలించిన బైకులు.. లేదంటే ఫేక్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేట్లు కావడంతో పోలీసుల దర్యాప్తు ముందుకు సాగడంలేదు. దీంతో అనుమానితులు, పాతనేరస్తులను విచారిస్తున్నారు తప్ప.. అసలు దొంగలను పట్టుకోలేక చేతులెత్తేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.. దొంగలు దొరకకపోవడం వల్ల బాధితుల బంగారం కూడా రికవరీ కావట్లేదు.