ఒక్క మీటింగ్‌‌‌‌‌‌‌‌లోనే రవితేజ నాపై పూర్తి నమ్మకం ఉంచారు:విష్ణు విశాల్

ఒక్క మీటింగ్‌‌‌‌‌‌‌‌లోనే రవితేజ నాపై పూర్తి నమ్మకం ఉంచారు:విష్ణు విశాల్

విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మట్టికుస్తీ’. రవితేజ, విష్ణు విశాల్ కలిసి నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో రవితేజ మాట్లాడుతూ ‘దర్శకుడు కథ చెప్పగానే అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా నచ్చింది. తన డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో నేనూ ఓ సినిమా చేయాలనిపించింది. గ్లామర్, టాలెంట్ కలిపితే ఐశ్వర్య లక్ష్మి. ఇందులో ఆమె పాత్రను ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇది కేవలం స్పోర్ట్స్ ఫిల్మ్ మాత్రమే కాదు.. లవ్, ఫ్యామిలీ, ఎమోషన్, ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్ అన్నీ ఉంటాయి.  హీరోగా నన్ను ఆదరించిన ప్రేక్షకులు, నిర్మాతగానూ అంతే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా’ అన్నాడు.

విష్ణు విశాల్ మాట్లాడుతూ ‘ఒక్క మీటింగ్‌‌‌‌‌‌‌‌లోనే రవితేజ నాపై పూర్తి నమ్మకం ఉంచారు. ఆడ, మగ సమానమని సందేశం ఇచ్చే సినిమా ఇది. మహిళా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’ అన్నాడు.  రవితేజ ఈ సినిమాను నిర్మించడం చాలా ఎక్సయిటింగ్‌‌‌‌‌‌‌‌గా ఉందంది ఐశ్వర్యలక్ష్మి.  డైరెక్టర్ మాట్లాడుతూ ‘విష్ణు విశాల్, ఐశ్వర్య అద్భుతంగా పెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మ్ చేశారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది’ అన్నాడు. కార్యక్రమానికి హాజరైన జ్వాలా గుత్తా, దర్శకులు సుధీర్ వర్మ, వంశీ ఈ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. అజయ్, కృష్ణ చైతన్య, జస్టిన్ ప్రభాకర్, రాకేందుమౌళి పాల్గొన్నారు.