- సీపీఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి
తిమ్మాపూర్(చిగురుమామిడి), వెలుగు: ఎన్కౌంటర్ల పేరిట మావోయిస్టులను హత్య చేయడం దుర్మార్గమని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో సీపీఐ మండల సమితి ఆఫీసు ముస్కు రాజిరెడ్డి స్మారక భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కేంద్రంలోని బీజేపీ కార్పొరేట్ పెట్టుబడిదారి శక్తులకు అనుకూల పాలన చేస్తోందని మండిపడ్డారు. ప్రగతి శీల, లౌకిక శక్తులు, వామపక్షాలు ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ తో సీపీఐ మిత్రపక్షంగానే ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి పిలిస్తే చర్చిస్తామని చెప్పారు.
