మోడీ ఈజ్ బ్యాక్ : అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలదీ అదే మాట!

మోడీ ఈజ్ బ్యాక్ : అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలదీ అదే మాట!

దాదాపుగా అన్ని ప్రధాన ఎగ్జిట్ పోల్స్ సంస్థల సర్వేల ఫలితాలు.. ఎన్డీయేకు అనుకూలంగా వచ్చాయి. ఎన్డీయే కూటమే వరుసగా రెండోసారి అధికారం చేపట్టబోతున్నట్టుగా ప్రకటించాయి. నరేంద్రమోడీ మరోసారి ప్రధానమంత్రి కాబోతున్నారని అంచనా వేశాయి. ఐతే… 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఒక్కపార్టీనే 282 సీట్లు గెల్చుకుంది. కొన్నేళ్ల తర్వాత.. సింగిల్ గా మెజారిటీని సాధించిన పార్టీగా రికార్డులకెక్కింది. ఎన్డీఏ కూటమి పార్టీలతో కలిపి.. 336 సీట్ల బలం బీజేపీకి ఉండేది. ఐతే.. ఈసారి బీజేపీ బలం 30 నుంచి 40 సీట్లు తక్కువగా ఉండొచ్చని పలు సర్వేలు అంచనా వేశాయి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావొచ్చని అభిప్రాయపడ్డాయి. ఐతే…

న్యూస్ ఎక్స్ మాత్రం ఏ పార్టీకి, కూటమికి మెజారిటీ రాదని భిన్నమైన సర్వే ఫలితాలు ప్రకటించింది. 

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ సర్వే – లోక్ సభ ఎన్నికలు

ఎన్డీయే – 306

యూపీఏ – 132

ఇతరులు – 104

ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్స్ – లోక్ సభ 2019

బీజేపీ+ – 298

కాంగ్రెస్+ – 118

ఇతురులు – 127

రిపబ్లిక్ టీవీ – సీ ఓటర్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ సర్వే

బీజేపీ+ – 287

కాంగ్రెస్+ – 128

ఇతరులు – 127

VDP అసోసియేట్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు

బీజేపీ + – 333

(BJP- 281, NDA -52 )

కాంగ్రెస్+ – 115

(Congress – 64, UPA – 51)

ఇతరులు – 94

న్యూస్ 18 – ఎగ్జిట్ పోల్స్

NDA – 336

UPA – 82

ఇతరులు – 124

న్యూస్ నేషన్ – ఎగ్జిట్ పోల్స్

NDA – 282-290

UPA – 118-126

ఇతరులు – 130-138

ఏబీపీ -ఏసీ నీల్సన్

NDA – 267

UPA – 127

Oth- 148

ఎన్డీయేకు మెజారిటీ రాదంటున్న న్యూస్ ఎక్స్ – నేతా 

న్యూస్ X – నేతా ఎగ్జిట్ పోల్

బీజేపీ + – 242

కాంగ్రెస్ + – 162

ఎస్పీ -బీఎస్పీ – ఆర్ఎల్డీ- 43

ఇతరులు – 88