
కైర్న్స్: ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (36 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 నాటౌట్), మిచెల్ మార్ష్ (37 బాల్స్‌లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 54) ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగడంతో సౌతాఫ్రికాతో మూడో, చివరి టీ20లో ఆస్ట్రేలియా లాస్ట్ ఓవర్లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో గెలిచిన ఆసీస్ సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. ఉత్కంఠ పోరులో తొలుత సఫారీ టీమ్ 20 ఓవర్లలో 172/7 స్కోరు చేసింది.
డెవాల్డ్ బ్రెవిస్ (26 బాల్స్‌లో 1 ఫోర్, 6 సిక్సర్లతో 53) మరోసారి మెప్పించగా.. డసెన్ (38 నాటౌట్) కూడా రాణించాడు. ఆసీస్ బౌలర్లలో నేథన్ ఎలీస్ మూడు, హేజిల్‌వుడ్, జంపా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌లో ఓ దశలో 122/6తో ఓటమి అంచుల్లో నిలిచిన ఆసీస్ మ్యాక్సీ మెరుపు బ్యాటింగ్‌తో 19.5 ఓవర్లలో 173/8 స్కోరు చేసి గెలిచింది. మ్యాక్స్‌వెల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, టిమ్ డేవిడ్‌కు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డులు లభించాయి.