రష్యా విక్టరీ డే ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

రష్యా విక్టరీ డే ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

ఉక్రెయిన్ పై చేపట్టిన ప్రత్యేక సైనిక చర్యను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్  పుతిన్  పూర్తిస్థాయి యుద్ధంగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ప్రకటన చేస్తారని అనలైజ్ చేస్తున్నారు ఎక్స్ పర్ట్స్. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ ఓటమికి గుర్తుగా రష్యాలో ఏటా మే 9న ‘విక్టరీ డే’ పేరుతో భారీగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈసారి కూడా విక్టరీ డే కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రష్యావ్యాప్తంగా పలు సిటీల్లో సోవియట్  జెండాలు, మిలిటరీ రిబ్బన్లు ఏర్పాటు చేశారు.

11 వారాలుగా ఉక్రెయిన్ లో ప్రత్యేక మిలిటరీ చర్యను ఇకపై పూర్తిస్థాయి యుద్ధంగా మారుస్తూ విక్టరీ డే ప్రసంగంలో పుతిన్  ప్రకటన చేసే అవకాశముందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్ పై యుద్ధాన్ని నాజీలపై పోరుగా చెప్తూ... వెంటనే సైనిక బలగాల్లో చేరాలంటూ పౌరులకు పిలుపునిచ్చే ఛాన్స్ ఉందంటున్నారు ఎక్స్ పర్ట్స్. దీంతో మాస్కోలోని రెడ్  స్క్వేర్  వద్ద పుతిన్ చేయనున్న ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. అయితే అదనపు బలగాల కోసం పౌరులను సైన్యంలోకి ఆహ్వానించే ప్రణాళికలేవీ తమకు లేవని చెప్తోంది పుతిన్ సర్కారు. మిలిటరీలో చేరాల్సిందిగా బలవంతం చేస్తే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చని రష్యా పౌరులు ఎక్కువగా సెర్చ్ చెస్తున్నట్లు సమాచారం. మాస్కోలో ఇవాళ వర్షం పడే అవకాశముందని, విక్టరీ డే కవాతుకు అది ఇబ్బందికరంగా మారొచ్చని అంచనా వేసింది  వాతావరణ శాఖ.

గతంలో అనేక సమస్యలకు కారణమైన నాజీయిజాన్ని మళ్లీ కొనసాగించకుండా... నివారిద్దామని అజర్ బైజాన్ , ఆర్మేనియా, బెలారస్ , కజఖ్ స్థాన్ , కిర్గిజ్ స్థాన్ , తజికిస్థాన్  సహా కామన్ వెల్త్  ఆఫ్  ఇండిపెండెంట్  స్టేట్స్  దేశాల ప్రజలకు పిలుపునిచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్ . విక్టరీ డే సందర్భంగా కామన్ వెల్త్ ఆఫ్ ఇండింపెండెంట్ స్టేట్స్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. డొనెట్స్క్ , లుహాన్స్క్ లనూ ప్రత్యేక రిపబ్లిక్ లుగా పేర్కొంటూ శుభాకాంక్షల తెలిపారు పుతిన్.