Mayabazar Re Release: మళ్లీ వెండితెరపై 68 ఏళ్ల నాటి క్లాసిక్ మాయాబజార్.. కలర్ వెర్షన్లో.. రీ రిలీజ్ ఎప్పుడంటే?

Mayabazar Re Release: మళ్లీ వెండితెరపై 68 ఏళ్ల నాటి క్లాసిక్ మాయాబజార్.. కలర్ వెర్షన్లో.. రీ రిలీజ్ ఎప్పుడంటే?

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు, మహానటి సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు లాంటి దిగ్గజాలు నటించిన సినిమా మాయాబజార్ (Mayabazar). కె.వి.రెడ్డి దర్శకత్వంలో విజయా ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి & చక్రపాణి ఈ సినిమాను రూపొందించారు. 1957లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ ప్రభంజనం. తెలుగు వారు ఇష్టపడే క్లాసిక్ చిత్రాల పరుసలో 'మాయాబజార్" ఎప్పటికీ ముందు స్థానంలో ఉంటుంది.

తరాలు గడుస్తున్న ఈ సినిమాపై వారికి ఉన్న ఆదరాభి మానాలు మాత్రం తగ్గలేదు సరికదా రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవల రీరిలీజ్ ట్రెండ్ ఊపందుకున్న తరుణంలో ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ నెల 28న ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా కలర్ వెర్షన్లో బలుసు రామారావు విడుదల చేస్తున్నారు.

ALSO READ | SSMB29: ఇదే నిజమైతే వెండితెర బద్దలే.. మహేష్ బాబుని ఢీ కొట్టడానికి రంగంలోకి స్టార్ హీరో!

ఈ క్రమంలో మాయాబజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇప్పటితరంలో ఎన్నో గ్రాఫిక్స్ వచ్చినా ఆనాడే గ్రాఫిక్స్ లేని సమయంలో ఎంతో అద్భుతంగా మాయాబజార్ సినిమాను మలిచి తిరుగులేని విజయాన్ని అందుకున్నారని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ ఛైర్మన్‌ టీడీ జనార్ధన్‌ అన్నారు. 

మాయాబజార్ లో నటించిన నటీనటులు ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుండిపోతారు. ఎన్‌టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి.రంగారావు, సావిత్రి, రేలంగి, గుమ్మడి, ముక్కామల, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, ఆర్. నాగేశ్వర రావు, సూర్యకాంతం, రమణా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. అప్పట్లోనే సుమారు రూ.33 లక్షలు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రూ.80 లక్షలుకు పైగా వసూళ్లు సాధించింది.