
వరల్డ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులలో SSMB29 ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇంటర్నేషనల్ వైడ్గా సినీ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రతిరోజు ఏదొక రూమర్ వైరల్ అవుతూనే ఉంది. ఇక ఈ ఏడాది జక్కన్న షూటింగ్ షురూ చేసిన దగ్గరనుండి అయితే, మరిన్ని వార్తలు రివీల్ అవుతున్నాయి.
లేటెస్ట్గా SSMB29 మూవీలో తమిళ స్టార్ హీరో, వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ కూడా నటిస్తున్నారనే వార్త బయటకి వచ్చింది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడని సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
Also Read : హరిహర వీరమల్లు థర్డ్ సింగిల్ రిలీజ్
ఇప్పటికే రాజమౌళి తనకు సంబంధించిన కథనం వినిపించాడని.. విక్రమ్ కూడా అందుకు సై అన్నాడని సమాచారం. త్వరలో ఈ విషయంపై ఓ క్లారిటీ రానుంది. అయితే, ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు కన్ఫామ్ అయింది.
అయితే, పృథ్వీరాజ్ సుకుమారన్ విషయంలో మాత్రం సందిగ్దత నెలకొంది. అలోమోస్ట్ ఆయన ఈ మూవీలో ఉన్నాడు. కానీ, ఆ మధ్య పృథ్వీరాజ్ స్థానంలో బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహంను తీసుకోనున్నట్లు టాక్ వినిపించింది. ఇదే సస్పెన్స్గా మారింది.
ఈ నేపథ్యంలోనే SSMB29లో విక్రమ్ నటిస్తున్నట్లు ఊపందుకున్నాయి. ఒకవేళ విక్రమ్ నటిస్తే ఈ సినిమాకు మరింత బలం చేకూరే అవకాశం ఉంది. విక్రమ్ లాంటి నటుణ్ని సరిగ్గా వాడుకునే దర్శకుడు ఉండాలే కానీ, నట విశ్వరూపం చూపించేస్తాడు. అలాంటి డైరెక్టర్ జక్కన్న అయితే, అందులో విక్రమ్ విలన్గా నటిస్తే.. ఇంకా చెప్పేదేం ఉంది. వెండితెర బద్దలే. దీనిపై మూవీ టీమ్ స్పందిస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే.. అంత పగడ్బందీగా ఈ సినిమా కానిచ్చేస్తున్నాడు జక్కన్న. త్వరలో ఈ సినిమాపై జక్కన్న ప్రెస్ మీట్ పెట్టి కాన్సెప్ట్ వీడియో రీలిజ్ చేస్తాడనే టాక్ కూడా నడుస్తోంది. చూడాలి మరి ఏమవుతుందో!