
అహ్మదాబాద్: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తీవ్రమైన అపెండిసైటిస్‌తో బాధపడుతున్నాడు. దీంతో ట్రీట్‌మెంట్, సర్జరీ కోసం అతన్ని ముంబైకి తరలించారు. ‘శనివారం రాత్రి రాహుల్‌కు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. మెడిసిన్స్ ఇచ్చినా పెద్దగా పని చేయలేదు. వెంటనే అతన్ని ఎమర్జెన్సీ రూమ్‌కు తరలించి టెస్ట్‌లు నిర్వహించగా అపెండిసైటిస్ అని తేలింది. సర్జరీ కోసం రాహుల్‌ను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించాం. నిపుణులైన వైద్య బృందం ఆదివారం రాత్రి సర్జరీ చేసే చాన్స్ ఉంది’ అని ఫ్రాంచైజీ వెల్లడించింది. సర్జరీ తర్వాత రాహుల్ కోలుకోవడానికి దాదాపు రెండు వారాల టైమ్ పట్టే అవకాశం ఉండటంతో పంజాబ్ టీమ్‌ను నడిపించే బాధ్యతను మయాంక్ అగర్వాల్‌కు అప్పగించారు. అయితే ఇంజ్యురీతో కోల్‌కతా మ్యాచ్‌కు దూరమైన మయాంక్.. పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న పంజాబ్‌కు రాహుల్ లేకపోవడం పెద్ద లోటే. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో రాహుల్ 66.20 యావరేజ్‌తో 331 రన్స్ చేశాడు.