
దుబాయ్: ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో నిలిచాడు. హోమ్‌గ్రౌండ్‌లో న్యూజిలాండ్‌తో పాటు ప్రస్తుతం సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌లో రాణించిన మయాంక్ 2021 డిసెంబర్ నెలకు గాను ఈ అవార్డుకు నామినేట్ అయ్యాడు. అతనితో పాటు న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఈ అవార్డుకు షార్ట్‌లిస్ట్ అయ్యారు. రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌తో పాటు కేఎల్ రాహుల్ గత నెలలో కొన్ని మ్యాచ్‌లకు దూరం కావడంతో వచ్చిన చాన్స్‌ను అగర్వాల్ బాగా యూజ్ చేసుకున్నాడు. డిసెంబర్‌లో కివీస్, సౌతాఫ్రికాపై ఆడిన రెండు మ్యాచ్‌ల్లో తను 69 యావరేజ్‌తో 276 రన్స్ చేశాడు. ఇందులో రెండు ఫిఫ్టీలు, ఓ సెంచరీ ఉంది. సఫారీలతో సెంచూరియన్ టెస్టులో ఇండియా ఫస్ట్ టైమ్ విక్టరీ సాధించడంలో కీ రోల్ పోషించాడు.